ట్రాఫిక్ సమస్యల పరిస్కారానికి GHMC మాస్టర్ ప్లాన్

ట్రాఫిక్ సమస్యల పరిస్కారానికి GHMC మాస్టర్ ప్లాన్

ktr

గ్రేటర్ ‌పరిధిలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి వీలైనన్ని ఎక్కువ స్లిప్‌రోడ్‌ల నిర్మాణమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రధాన రోడ్లపై వాహనాల భారం తగ్గించేలా GHMC సాధ్యమైనన్ని ఎక్కువ స్లిప్‌రోడ్లను నిర్మించాలని అన్నారు. గురువారం ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో GHMC అధికారులకు మంత్రి కేటీఆర్‌ సూచనలు చేశారు. GHMC పరిధిలో ఇప్పటికే మొదటి దశలో భాగంగా 55 స్లిప్‌రోడ్లను గుర్తించామని.. వీటి నిర్మాణానికి వేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అధికారులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ఇప్పటికే 40 రోడ్లకు రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ సిద్ధమైందన్నారు. ఇందులో 20 రోడ్లలో కేవలం 90 ఆస్తుల సేకరణ పూర్తిచేస్తే స్లిప్‌రోడ్‌ ల నిర్మాణం మొదటిదశ ప్రారంభించేందుకు వీలవుతుందన్నారు.

హైదరాబాద్‌ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో నగర రోడ్లపై వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతోందని.. దీన్ని ఎదుర్కొని సులభంగా గమ్యం చేరేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మం త్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే స్ట్రాటెజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌, కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌ వంటి కార్యక్రమాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన పెద్దయెత్తున చేపడుతున్నామని అన్నారు. దీంతోపాటు అభివృద్ధి ద్వారా కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. రోడ్ల వెంబడి పాదచారులు నడిచేందుకు వీలుగా పెద్దయెత్తున ఫుట్‌పాత్‌ల నిర్మాణం కూడా చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికే ప్రతి జోన్‌లో కనీసం పది కిలోమీటర్ల చొప్పున జనసమ్మర్ధం ఉండే రోడ్ల వెంబడి ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. GHMC బస్‌బేల నిర్మాణం కోసం పలు ప్రాంతాలను గుర్తించామని అన్నారు. ఈ ప్రాంతాల్లో బస్‌ బేల నిర్మాణం మరింత వేగంగా పూర్తిచేయాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చేపడుతున్న రోడ్ల వివరాలను మంత్రి కేటీఆర్‌ ఈ సమావేశంలో అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ నగరంలో ఉన్న హైటెన్షన్‌ వైర్ల కింద రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి.. ఒక నివేదిక సిద్ధం చేయాలని GHMC అధికారులను కోరారు. HMDA చేపడుతున్న రోడ్ల నిర్మాణంతో GHMC చేపడుతున్న రోడ్ల నిర్మాణ ప్రణాళికలను సమన్వయం చేసుకోవాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story