క్రిస్‌మస్ తాతా.. నాకు నాన్న కావాలి.. ఇస్తావా

అమ్మ అంటే ఇష్టం.. నాన్నంటే మరీ ఇష్టం. అన్నం పెట్టడానికి అమ్మ ఉన్నా ఆడించడానికి నాన్న లేడు. మా ఫ్రెండ్స్ అంతా వాళ్ల నాన్న గురించి చెబుతుంటే నాకూ నాన్న ఉంటే నేను అంత సంతోషంగా ఉండేవాడిని కదా. తాతా మరి మా కోసం ప్రతి సంవత్సరం నువ్వు చాలా గిప్ట్‌లు తీసుకొస్తావు కదా. ఈసారి నాకోసం నాన్నను తీసుకురావా ప్లీజ్ అంటూ శాంతా క్లాజ్‌కి ఏడేళ్ల బాలుడు లేఖ రాసాడు. అమెరికా‌లోని ప్రముఖ చర్చ్‌లన్నింటికీ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని వేల కొలది ఉత్తరాలు వస్తుంటాయి. అవి చదివి శాంతా క్లాజ్ తమకు గిప్ట్‌లు తీసుకువస్తారని ఆశపడుతుంటారు.

టెక్సాస్‌కు చెందిన బ్లాకే.. గృహహింస బాధితుల ఆశ్రమంలో తల్లితో కలిసి ఉంటున్నాడు. కొడుకు స్కూల్ బ్యాగు సర్ధుతుంటే అమ్మకి ఓ లేఖ దొరికింది. దాన్ని చదివి ఆమె భావోద్వేగానికి గురైంది. ఆ లెటర్‌ని ఆశ్రమ నిర్వాహకుడికి అందజేసింది. ఆయన దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. బ్లాకే.. శాంతాక్లాజ్‌కు రాసిన లేఖలోని సారాంశం.. అమ్మా, నేను ఇల్లు వదిలి ఇక్కడకు వచ్చాము. మా నాన్నకు పిచ్చి ఉంది. అక్కడే నాన్నతో ఉంటే భయంతో బతకాల్సి వస్తుందని అమ్మ చెప్పింది. అందుకే ఇక్కడ ఉన్నాము. కానీ నాకు నాన్న కావాలి. మంచి నాన్న కావాలి. ఇంకా నువ్వు వచ్చేటప్పుడు నా చాప్టర్ బుక్స్, డిక్షనరీ, కాంపస్, వాచ్ కూడా పట్టుకొస్తావా అని శాంతాక్లాజ్‌కి లేఖ రాశాడు. లేఖ చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లుతాయి. పసివాడు తండ్రి కోసం ఎంతగా తపిస్తున్నాడో అర్థమవుతోంది.

Read MoreRead Less
Next Story