క్రిస్మస్ తాతలా మారిన విరాట్ కోహ్లీ

X

గ్రౌండ్ లో అరవీర భయంకరంగా విరుచుకుపడే విరాట్ కోహ్లీ.. కొత్త అవతారం ఎత్తాడు. చిన్నారుల కోసం క్రిస్మస్ తాతగా అలరించాడు. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో భాగంగా.. కోల్ కతాలోని అనాథశ్రమానికి శాంటాక్లాజ్ రూపంలో వెళ్లాడు. పిల్లలకు కోరుకున్న బహుమతులు అందించి.. వారిని ఉత్సాహపరిచాడు. అయితే, పిల్లలు కోహ్లీని గుర్తుపట్టలేదు. దీంతో.. మీరు విరాట్ కోహ్లీని కలుసుకుంటారా అంటూ.. ఒక్కసారిగా గెడ్డం, టోపీ తీసేశాడు. అంతే.. కోహ్లీని చూసిన పిల్లలంతా ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
