మార్స్ పై మరో ప్రయోగానికి సిద్ధమైన నాసా

మార్స్ పై మరో ప్రయోగానికి సిద్ధమైన నాసా

nasa

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగార గ్రహంపై పరిశోధనకు మరోసారి రోవర్ ను పంపనుంది. 2020 వేసవిలో రోవర్ ను పంపించి, అంగారక గ్రహంపై నీటిజాడలపై పరిశోధించనుంది. దీనిద్వారా ఒకప్పుడు ఈ గ్రహంపై జీవం ఉండేదా అనే విషయాలను కచ్చితంగా తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుందుని చెపుతోంది. ఈ సారి పంపించే మార్స్ కు ప్రత్యేకంగా ఒక చేయి ఉంటుందని.. దాంతో గ్రహంపై ఉన్న రాళ్లను సైతం ముక్కలు చేసి పరిశోధన చేసి భూమిపైకి పంపిస్తుందని నాసా తెలిపింది. 2004లో నాసా క్యూరియోసిటీ రోవర్ ను పంపించింది. అది గ్రహానికి సంబంధించిన విలువైన ఫోటోల్ని పంపించింది. వాటిద్వారా అక్కడ నీటిజాడలు ఉన్నట్లు గుర్తించినా పూర్తి స్పష్టత రాకుండా పోయింది.

Tags

Read MoreRead Less
Next Story