వదినా.. నువ్వైనా..

వదినా.. నువ్వైనా..
X

akhil

అక్కినేని వారింట అందరూ హీరోలే. అఖిల్‌కి ఎందుకో ఒక్క హిట్టూ పడట్లేదు. ఈసారి ఎలా అయినా తానేంటో ఫ్రూవ్ చేసుకోవాలనుకున్నాడు.. బన్నీవాసుని, అల్లు అరవింద్‌ని రంగంలోకి దింపాడు. బొమ్మరిల్లు చిత్ర దర్శకుడు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. తండ్రి పాత్ర కోసం దర్శకుడు సముద్ర ఖని, మరో ముఖ్య పాత్ర కోసం సమంతని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎప్పుడో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా నటీనటుల డేట్స్ విషయంలో జాప్యం జరుగుతోంది. ఇప్పుడు సమంత ఎంట్రీ కన్ఫామ్ అని తెలిసాక ప్రాజెక్ట్ ముందుకు వెళుతుందేమోనని ఆశిస్తోంది చిత్ర యూనిట్. మరి వదినైనా తనను గట్టెక్కిస్తుందేమోనని మరిది అఖిల్ ఆశగా ఎదురుచూస్తున్నాడు.

Next Story

RELATED STORIES