తాజా వార్తలు

కాంగ్రెస్‌ ఏ వర్గానికీ వ్యతిరేకం కాదు : టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

కాంగ్రెస్‌ ఏ వర్గానికీ వ్యతిరేకం కాదు : టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌
X

utthamkumarreddy

సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో టీ కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేపట్టారు.. ఆలిండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.. ట్యాంక్‌ బండ్‌పై అంబేద్కర్‌ విగ్రహం దగ్గర హస్తం నేతలు ధర్నా చేశారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.. మోదీ ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని వారంతా డిమాండ్‌ చేశారు. విభజన రాజకీయాలు మంచివి కావని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా మౌనం వీడి బిల్లు అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీజేపీ రాజ్యాంగాన్ని నాశనం చేసిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఏ వర్గానికీ వ్యతిరేకం కాదన్నారు.. ఈనెల 28న గాంధీ భవన్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు ఉత్తమ్‌ చెప్పారు.

Next Story

RELATED STORIES