పల్లె ప్రగతి అమలుపై సీరియస్ గా ఉన్న సీఎం కేసీఆర్

పల్లె ప్రగతి అమలుపై సీరియస్ గా ఉన్న సీఎం కేసీఆర్

cm-kcr

పల్లె ప్రగతి అమలుపై సీరియస్ గా ఉన్నారు సీఎం కేసీఆర్. జనంలో స్పందన బాగానే ఉన్నా అధికారుల అలక్ష్యంతో ఫలితాలు అందుకోలేకపోయామనే భావనలో ఉంది ప్రభుత్వం. అందుకే జనవరిలో మరో విడత చేపట్టాలని నిర్ణయించారు. దీంతో అలర్టైన మంత్రులు పల్లె ప్రగతిని విజయవంతం చేసే పనిలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పల్లె ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిచిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి అమలును అధికారులు సీరియస్ గా తీసుకోవాలని అన్నారు.

మరోవైపు సిద్దిపేటలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రామల్లో పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డులో 52 మత్స్యకార కుటుంబాలకు చేపల అమ్మకపు వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మార్కెట్‌ యార్డులో సరైన ఏర్పాట్లు చేయని మత్స్యశాఖ అధికారులపై మంత్రి హరీష్‌రావు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.

ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడిలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నారని అన్నారాయన. ఖమ్మం జిల్లాలో 7 వేల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.

ఇక వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఈటెల రాజేందర్..చర్చిలు మానవతా విలువల్ని పెంచేలా ఉన్నాయని అన్నారు. మనుషుల మధ్య అప్యాయతలు, బంధాలు తగ్గిపోతున్నాయని అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్తొన్నారు ఈటల.

క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హజరైన మంత్రి ఈటల..వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి క్రైస్తవులకు దుస్తులు పంచిపెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story