వెన్నులో బుల్లెట్ ఉన్న విషయం మర్చిపోయి.. ఓ మహిళ రెండేళ్లుగా..

వెన్నులో బుల్లెట్ ఉన్న విషయం మర్చిపోయి.. ఓ మహిళ రెండేళ్లుగా..

80550706_2964361680243694_2061953596253011968_n

కాల్లో ముల్లు గుచ్చుకున్నా, కంట్లో నలకపడ్డా తీసిందాకా నిద్రపట్టదు. మరి అలాంటిది రెండేళ్లుగా బాడీలో బుల్లెట్టున్నా ఎలా తట్టుకుందో ఏమో. ఈ మధ్య వెన్నునొప్పిగా ఉందని డాక్టర్ దగ్గరకు వెళితే ఆమె ఒంట్లో బుల్లెట్ ఉన్న విషయం బయటపడింది. ఆరా తీస్తే రెండు సంవత్సరాల క్రితం ఆమెపై కాల్సులు జరిపినట్లు తెలిసింది.

వెన్ను నొప్పికి చికిత్స కోసం నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లిన యువతి శరీరంలో బుల్లెట్ బయటపడటం కలకలం రేపింది. గత మూడు నెలలుగా వెన్ను నోప్పితో బాధపడున్న ఫలక్‌నామాకు చెందిన ఆస్మాబేగం చికిత్స కోసం నిమ్స్‌కు చేరింది. ఎక్సెరేతో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించి వెన్నుపూస, ఉదర కోశంలో గాయమున్నట్లు వైద్యులు గుర్తించారు. యువతికి శస్త్ర చికిత్స నిర్వహించగా బుల్లెట్ బయటపడింది. దీంతో కంగుతిన్న వైద్యులు పంజాగుట్టా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నిమ్స్‌ వైద్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బులెట్‌ను స్వాధీనం చేసుకుని పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపిచారు. అది ఎప్పుడు, ఎలా తగిలిందనే కోణంలో యువతి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. రెండేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపినట్లు వివరించారు. అప్పుడు తూటా వెన్నులోకి దూసుకుపోయి అలాగే ఉండిపోయి ఉంటుందని చెప్పారు.

అయితే రెండేళ్ల క్రితమే తూటా దిగినా ఇప్పటి వరకు ఆ విషయం బటయపెట్టకపోవడం పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిందెవరు. ఏసందర్భంలో ఎక్కడ కాల్పులు జరిగాయి. పోలీసుల దృష్టికి ఎందుకు తీసకురాలేదన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read MoreRead Less
Next Story