వరుసగా పదో సిరీస్ ను దక్కించుకున్న టీమిండియా

వరుసగా పదో సిరీస్ ను దక్కించుకున్న టీమిండియా

IND_0

సిరీస్ విజయాన్ని తేల్చే కటక్ వన్డేలో భారత్ తడాఖా చూపించింది. మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. దీంతో సొంతగడ్డపై ఎదురులేదని మరోమారు నిరూపించుకుంది టిమిండియా. 316 పరుగుల విజయ లక్ష్యాన్ని 6 వికెట్లు కొల్పోయి మరో 8 బాల్స్ మిగిలి ఉండగానే పూర్తి చేసింది.

విండీస్ విసిరిన బిగ్ టార్గెట్ తో రోహిత్‌శర్మ, లోకేశ్ రాహుల్, కోహ్లీల సూపర్ బ్యాటింగ్ తో చిన్నబోయింది. రోహిత్ శర్మ 63 పరుగులు, లోకేశ్ రాహుల్ 77 పరుగులతో విజృంభించారు. వీళ్లిద్దరు తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా ఘనత సాధించారు. 1996 లో జయసూర్య నెలకొల్పిన 2387 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్‌ ఈ ఏడాదిలో 2450 పరుగులు సాధించాడు.

రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ మరోమారు జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు. వరుసపెట్టి వికెట్లు కోల్పోతున్న సమయంలో 85 పరుగులతో టీమిండియా విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడు. కోహ్లీ రాణించినా..మరో ఎండ్ లో వికెట్ల పతనం టెన్షన్ పుట్టించింది. కానీ, జడేజా, శార్దూల్ కలిసి మ్యాచ్ ను వన్ సైడ్ చేశారు. దీంతో మరో 8 బాల్స్ మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ బ్యాట్స్ మెన్లలో నికోలస్ పూరన్ 89 పరుగులు, కెప్టెన్ కీరన్ పొలార్డ్ 74 పరుగులతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. పొలార్డ్ అయితే సిక్సర్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరి దెబ్బకు స్కోరు బోర్డు ఒక్కసారిగా పరుగులు తీసింది. దీంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సైనీ రెండు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్, షమీ, జడేజాలు చెరో వికెట్ తీశారు. ఈ సిరీస్ విజయంతో వెస్టిండీస్ పై టీమిండియా వరుసగా పదో సిరీస్ ను దక్కించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story