తాజా వార్తలు

మోగిన పురపాలక నగారా

మోగిన పురపాలక నగారా
X

తెలంగాణలో పురపాలక ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 22న పోలింగ్ జరగనుండగా.. 25న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు తీసుకుంటారు. జనవరి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై ఆ తర్వాతి రెండు రోజులు అప్పీల్‌ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. జనవరి 14న నామినేషన్ల ఉపసంహరణకు గడువిస్తారు. 22న పోలింగ్‌ నిర్వహించి.. 25న ఫలితాలు ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

Next Story

RELATED STORIES