హిట్ కళతో వస్తున్న "ఇద్దరిలోకం ఒకటే"

హిట్ కళతో వస్తున్న ఇద్దరిలోకం ఒకటే
X

iddarilokam-okkate

యంగ్ హీరో రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా దిల్ రాజు నిర్మించిన సినిమా ఇద్దరి లోకం ఒకటే. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ పై పాజిటివ్ బజ్ ఉంది. టీజర్లు, సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై ఆఢియన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగింది.

ఇద్దరిలోకం ఒకటే సినిమాకి ప్రివ్యూ షోల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినీ ప్రముఖులను మెప్పించిన ఈ సినిమాకి, రివ్యూ రైటర్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుందనే టాక్ వస్తోంది. దర్శకుడి టేకింగ్ హీరో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అంటున్నారు.

రాజ్ తరుణ్ కి చాలా రోజుల తర్వాత మంచి హిట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే షాలినీ పాండేకి కూడా మంచి హిట్ గా నిలుస్తుందంటున్నారు. ఇక దిల్ రాజు ఇయర్ ఎండింగ్ లో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

Next Story

RELATED STORIES