మెగా క్యాంప్ లో మహా మాయగాడు

మెగా క్యాంప్ లో మహా మాయగాడు

mega

ఒక స్టార్ హీరో లేదా దర్శకుడు.. తమ వ్యవహారాలు చూసుకోవడానికి మేనేజర్స్ ను నియమించుకోవడం మామూలే. అంటే అన్ని విషయాల్లో వాళ్లు ఇన్వాల్వ్ కాలేరు.. చాలా విషయాలు నేరుగా చెప్పలేరు కాబట్టి.. ఈ మేనేజర్స్ సాయం తీసుకుంటారు. ఓ రకంగా వీళ్లు వారి ఆత్మ. అందుకే మేనేజర్ అంటే పరిశ్రమలో ఒకరకమైన గౌరవం ఉంటుంది. కాకపోతే కొందరు ఉంటారు. మేనేజర్ అంటే తను ఎవరి దగ్గర, ఎవరి కోసం పనిచేస్తున్నామో మరిచిపోయి.. వాళ్ల కోసం వచ్చిన వాళ్లను మేనేజ్ చేస్తూ మనీ వెనకేసుకోవడమే పనిగా ఉంటారు. ఆశ్చర్యం అంటే ఎంతో ఫిల్టర్ తర్వాతే వీళ్లు ఆయా హీరోలు, దర్శకుల వద్ద చేరతారు. అందుకే పాపం వాళ్లు కూడా ఈ మేనేజర్స్ ను ఎక్కువగా నమ్ముతారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ భారీగా సొమ్ముకుంటున్నాడీ మేనేజర్. కొన్నాళ్ల క్రితమే అతను మెగా క్యాంప్ లో ఎంటర్ అయ్యాడు. అప్పటి నుంచి పాపం ఆ ఫ్యామిలీకి విజయమే లేకుండా పోయింది. అయితే అతను అక్కడ అడుగుపెట్టడానికి ముందే క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద పనిచేశాడు. ఈ దర్శకుడి వద్ద పనిచేసినంత కాలం ఆయన్ని ముంచడానికే ఎక్కువగా ఆలోచించేవాడనీ.. ఆ పనిలో విజయం సాధించగానే కృష్ణవంశీని వదిలేసి ఏవో తంటాలు పడి మెగా క్యాంప్ లో చేరాడు. అప్పటి నుంచి చిరంజీవితో పాటు రామ్ చరణ్ ల వ్వవహారాలకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహరాలు నిజాయితీగా ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మనం ఇంత చెప్పుకోనక్కర్లేదు.

అతను మెగా క్యాంప్ లోకి వచ్చిన తర్వాత అన్నీ సమస్యలే. ‘వినయ విధేయ రామ డిజాస్టర్’ కు ప్రధాన కారణాల్లోఇతనూ ఒకడని చాలామందికి తెలియదు. దర్శకుడైనా, నిర్మాతైనా లేదా ఆర్టిస్టులైనా అతను మేనేజ్ చేసి తనకు అనుకూలంగా లేదా తనకు లాభం చేకూరేలా చేసుకోవడంలో అతన్ని మించిన వారు ఇండస్ట్రీలోనే లేరని చెబుతారు. అంతే కాదు.. గతంలో కృష్ణవంశీతో పాటు గోవిందుడు అందరివాడేలే విషయంలో అనవసరమైన పుల్లలు కూడా వేశాడు అని కృష్ణవంశీ వద్ద పనిచేసిన ఎవరైనా చెబుతారు..

ఇక ప్రధానంగా అతని వల్ల మెగా హీరోలకు ఈ మధ్య చెడ్డ పేరు ఎక్కువైంది. అందుకు ప్రధాన కారణం సైరా సినిమా. ఈ సినిమా కోసం చిరంజీవి కానీ, నిర్మాతగా రామ్ చరణ్ కానీ ఎంత ప్రాణం పెట్టారో అందరికీ తెలుసు. కానీ అటు డిస్ట్రిబ్యూషన్ నుంచి ఆర్టిస్టుల వరకూ మెగా హీరోలు అత్యంత ఎక్కువగా నమ్మిన ఆ మేనేజర్ చేయని నేరం(నిజమే ఇది నేరమే) లేదంటున్నారు. డబ్బులు ఇవ్వాల్సిన వారికి ఇవ్వలేదు. అటు డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ ను మోసం చేశాడు. దీంతో సైరా వల్ల నష్టపోయిన వాళ్లంతా ఇప్పుడు మెగాస్టార్ కొత్త సినిమాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని ఎప్పుడో సెటిల్ చేశాను కదా అనుకున్న రామ్ చరణ్ కు అసలు విషయం అర్థం కావడం లేదు. అంతే కాదు.. ఇదంతా రామ్ చరణే చేశాడు అనుకునేవాళ్లూ ఉన్నారు. మరి తనను నమ్మిన వాళ్లను ముంచడంలో మాస్టర్ డిగ్రీ ఉన్న ఈ మేనేజర్ లీలల గురించి మెగా హీరోలకు ఎవరూ చెప్పలేకపోతున్నారు. వాళ్లేమో ‘మన మనిషి’కదా అనుకుంటారు. కానీ అతను ‘‘మనీ మనిషి’’అనేది పసిగట్టలేకపోతున్నారు.

ఇక ఈ వ్యక్తి ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచీ మొదటగా చేసిన పని అల్లు అరవింద్ ను పక్కన బెట్టడం. మరి ఇతన్లో ఏం చూసి మెగాస్టార్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చారో కానీ.. చిరంజీవి గత సినిమా సైరా టైమ్ లో అల్లు అరవింద్ సీన్ లో ఉండి ఉంటే ఖచ్చితంగా సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా మార్కెట్ మరింత పెరిగి ఉండేదని ఆయన బిజినెస్ స్ట్రాటజీస్ గురించి తెలిసిన ఎవరైనా అంటారు. నిజానికి సైరా టైమ్ లో చాలామంది అల్లు అరవింద్ రావడం లేదు.. అల్లు అర్జున్ కేవలం ఒక్క ట్వీట్ తోనే సరిపెట్టాడు అని విమర్శలు చేశారు కానీ.. వాళ్లు రాకపోవడానికి ప్రధాన కారణం ఈ వ్యక్తే అని చాలామందికి తెలియదు. ఇన్నాళ్లూ మెగా హీరోలకు బ్యాక్ బోన్ గా నిలిచిన అరవింద్ నే సైడ్ చేయగలిగాడు అంటే ఇతగాడు ఎంత కన్నింగ్ అనేది వేరే చెప్పక్కర్లేదేమో.

మొత్తంగా ఇప్పుడు ఆ వ్యక్తి కారణంగానే చిరంజీవి, కొరటాల శివ సినిమా సందిగ్ధంలో పడిపోయింది. దీనికి కారణం రామ్ చరణ్ అనేది చాలామంది భావన. కానే కాదు. తండ్రి లెగసీని కంటిన్యూ చేయడంలో ప్రతి విషయంలో రామ్ చరణ్ డసిప్లిన్ గానే ఉంటున్నాడు. కానీ మధ్యలో ఉన్న ఈ వ్యక్తి వారి డిసిప్లిన్ కే కాదు.. వారి డిగ్నిటీకి కూడా భంగం కలిగిస్తూ బయటి వారికి మెగా హీరోలు మంచి వాళ్లు కాదు అనే ఇంప్రెషన్ కలిగేలా చేస్తూ... వీలైనంత వరకూ దండుకుంటూ వెళుతున్నాడు ఆ వ్యక్తి. మరి ఈ వ్యక్తి గురించి మెగా హీరోలకు ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిది. లేదంటే కొణెదల ప్రొడక్షన్ ను ఆదిలోనే ముంచి వేయగల సత్తా అతని సొంతం. నిజానికి మేనేజర్ అంటే అతన్ని పెట్టుకున్న వాళ్ల ఆత్మ. ఆత్మ అంటే తనను నమ్మినవాళ్లకు అద్దంలా నిలవాల్సిన వ్యక్తి ప్రేతాత్మలా మారి వారి గౌరవానికి భంగం కలిగిస్తూ బ్యాంక్ బ్యాలన్స్ పైనే కాన్ సెంట్రేట్ చేస్తున్నాడంటే.. ఇతన్లాంటి వ్యక్తులు పరిశ్రమకు ఎంత ప్రమాదమో ఊహించొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story