తెలంగాణలో మోగిన పుర నగారా

తెలంగాణలో మోగిన పుర నగారా

ts-elections

తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 10 కార్పోరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల సంఘం. 2020 జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. జనవరి 22న ఎన్నికలు నిర్వహించి... 25 న ఫలితాలు వెల్లడించనున్నారు. జనవరి 8న రిటర్నింగ్‌ అధికారులు ఆయా ప్రాంతాల్లో ఎలక్షన్‌ నోటీస్‌ ఇస్తారు.

జనవరి 10న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్లు పరిశీలించనున్నారు. 14వ తేదీ ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. జనవరి 22న పోలింగ్‌ నిర్వహించి 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రీపోలింగ్‌ చేపట్టాల్సి వస్తే 24న నిర్వహిస్తారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌.

ఇక డీసెంబర్‌ 30న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాపై డిసెంబర్‌ 31 నుంచి జనవరి 2వరకు అభ్యంతరాలు తీసుకుంటారు. అనంతరం రాజకీయ పార్టీలతో జిల్లాల వారిగీ సమావేశం నిర్వహిస్తారు. జనవరి 1న మున్సిపల్ కమిషనర్లతో ఎన్నికల సంఘం భేటీ అవుతుంది. జనవరి3న అభ్యంతరాలను పరిష్కరిస్తారు. జనవరి 4న తుది జాబితా విడదుల చేస్తారు..

అయితే గ్రేట్‌ హైదరాబాద్‌, గ్రేటర్‌ వరంగల్‌, గ్రేటర్‌ ఖమ్మం కార్పోరేషన్ల పదవి కాలం ఇంకా పూర్తి కాలేదు. వీటికి మరో ఎడాది పాటు గడువు ఉంది. దీంతో 10 కార్పోరేషన్లకే ఎన్నికలు జరగనున్నాయి. అయినా ఈ కార్పోరేషన్లకూ ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందన్నారు ఎన్నికల సంఘం ఉన్నతాధికారు. దీంతో ఎన్నికలు ముగిసే వరకు అభిృవద్ధి పనులకు శంకుస్థాపనలకు బ్రేక్‌ పడనుంది.

Tags

Read MoreRead Less
Next Story