సినిమా ప్రమోషన్స్ లో డిజిటల్ మోసాలు

సినిమా ప్రమోషన్స్ లో డిజిటల్ మోసాలు
X

digital-fraud

సినిమా.. ఎంతో కష్టపడి.. ఎంతోమంది శ్రమ ఫలితంగా వచ్చే అవుట్ పుట్. కానీ ఆ అవుట్ పుట్ ఆడియన్స్ వరకూ వెళ్లాలంటే ప్రమోషన్స్ కంపల్సరీ. ఒకప్పుడు వాల్ పోస్టర్స్ తో పాటు రిక్షాల్లో మైక్ సెట్స్ తో ప్రమోషన్స్ చేసేవాళ్లు. ఎన్ని కాలాలు మారినా వాల్ పోస్టర్ డిమాండ్ తగ్గలేదు. కానీ ట్రెండ్ కు తగ్గట్టుగా ఇతరత్రా ప్రమోషనల్ యాక్టివిటీస్ పెరిగాయి. అందులో ప్రధానంగా నేడు కనిపిస్తున్నది డిజిటల్ మీడియా ప్రమోషన్స్. అయితే వీటిని అడ్డుపెట్టుకుని కొందరు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఒక రకంగా ఇప్పుడు డిజిటల్ ఫ్రాడ్ టాలీవుడ్ లో ఓ దందాలా మారింది.

ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమా వాళ్లు అప్డేట్ అయినంతగా మరెవరూ కారేమో అనిపించేలా వాళ్లు ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించే ప్రయత్నమే చేస్తుంటారు. అలా మారిన ట్రెండ్ కోసం అని ఒకప్పుడు అవుట్ డోర్ ప్రమోషన్స్ లో కనిపించిన వాల్ పోస్టర్స్, వినైల్ పోస్టర్స్ తో పాటు హోర్డింగ్స్ కు అయ్యే ఖర్చును తగ్గించుకున్నారు. కారణం ఇప్పుడు అంతా డిజటలైజేషన్ కావడమే.. అలా తగ్గించుకున్న బడ్జెట్ తో పాటు మరింతగా కలిపి డిజటల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ డిజిటల్ మీడియా ప్రమోషన్స్ అనేది అందరికీ అంత సులువుగా అర్థమయ్యే వ్యవహారం కాదు. దీంతో కొన్ని ప్రధాన సినిమా ప్రొడక్షన్ హౌసెస్ తో పాటు హీరోల వద్ద పనిచేసే మేనేజర్ స్థాయి వ్యక్తులు మాయలు చేస్తున్నారు. ఆ మాయల్లో పడిపోయి వాళ్లు అడిగినంత బడ్జెట్ ప్రొడక్షన్ హౌస్ లు కేటాయిస్తున్నాయి. కానీ ఆ స్థాయిలో సినిమాకు ఉపయోగపడేలా ప్రమోషన్స్ జరగడం లేదనేది వాస్తవం. సినీ పరిశ్రమలో ఒకప్పుడు మామిడికాయలాంటి కంపెనీలు డిజటల్ మీడియా ప్రమోషన్స కు కేటాయించే బడ్జెట్ లో సింహభాగం కేటాయించేవారు. బడ్జెట్ పెరుగుతుందనే కారణంతో కొందరు మధ్యవర్తులు గోడమీద పిల్లిలాంటి కంపెనీలతో బేరాలు కుదుర్చుకుంటూ కమీషన్స్ కొట్టేస్తున్నారు. దీంతో కొన్ని కంపెనీలు సినిమాలకు ప్రాపర్ ప్రమోషన్స్ చేయకుండా మాయ చేస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ప్రొడక్షన్ హౌస్ లు మాత్రం ఆ వైపు నుంచి కాస్త ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయడం.. వారి అంచనాలకు ఏ మాత్రం దగ్గరగా ప్రమోషన్స్ లేకపోవడం వంటివి ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. అయినా మధ్యలో ఉన్న మహామాయగాళ్ల వంటి వ్యక్తులు మాత్రం డిజిటల్ ప్రమోషన్స్ లో నిర్మాతలకు అసలు విషయం తెలియకుండా భారీ ప్రమోషన్స్ జరుగుతున్నాయనేలా బిల్డప్పులు ఇస్తున్నారు.

ప్రాధాన్యం లేని కంపెనీలకు డిజిటల్ ప్రమోషన్స్ కోసం సినిమా రేంజ్ ను బట్టి కాస్త ఎక్కువే బడ్జెట్ కేటాయించే ప్రొడక్షన్ హౌస్ లు మధ్యలో ఉన్న వ్యక్తులను గుడ్డిగా నమ్మడం మూలాన మరింతగా నష్టపోతున్నారు. ఏ ప్రమోషన్ వల్ల తమ కష్టానికి కనీస ఫలితం రావాల్సి ఉందో.. ఆ ప్రమోషన్స్ లోనే కమీషన్స్ కొట్టేస్తూ కొందరు చేస్తోన్న మోసాలకు పాపం నిర్మాతలు రెండు విధాలుగా నష్టపోతున్నారు.

ప్రమోషన్ లేని సినిమా ఫైట్లు, పాటలు లేని మాస్ సినిమా లాంటిది. ఈ రెండూ లేకుండా మాస్ సినిమా చూస్తే ఎలాంటి అనుభూతి వస్తుందో.. ప్రమోషన్ లేకుండా సినిమా గురించీ ఏ అంచనా రాదు. అందుకే మారుతున్న కాలానికి అగుణంగా వస్తోన్న డిజిటల్ మీడియా ప్రమోషన్స్ ను మరింత క్రియేటివ్ గా చేయాల్సిన మధ్యవర్తులు.. కేవలం లాభాపేక్షత ఇలా గోడ కంపెనీలతో బేరాలు కుదుర్చుకుని.. నిర్మాతలను ముంచుతున్నారు. మరి ఇలాంటి వ్యక్తులకు ఇకనైనా అడ్డుకట్ట వేయకపోతే డిజిటల్ మీడియా ప్రమోషన్స్ అన్నీ ఫ్లాప్ సినిమాకు పెట్టిన బడ్జెట్ లా వేస్ట్ అయిపోతాయ్.

ఇలాగే గతంలో కూడా నిర్మాతల మండలి నుంచి యాంటీ పైరసీ అంటూ ఓ స్ట్రాంగ్ వింగ్ ను ఏర్పాటు చేశారు. కానీ దానినుంచి వచ్చిన ఫలితం ఏమిటి అనేది అందరికీ తెలుసు. ఇక ఇలాంటి డిజిటల్ ఫ్రాడ్స్ పై కూడా ఓ గట్టి నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటే నిర్మాతలకే మంచిది. ఇది ఇప్పటికిప్పుడే ఫలితాలనివ్వకపోయినా.. రాబోయే రోజుల్లో ఇలాంటి అనవసర ఖర్చులతో నిర్మాతలు మరింత నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికైనా నిర్మాతల మండలి ఆ దిశగా ఆలోచిస్తుందేమో చూడాలి.

Next Story

RELATED STORIES