తాజా వార్తలు

సిద్ధిపేట్‌లోని CSI చర్చిలో హరీష్ రావు క్రిస్మస్ వేడుకలు

సిద్ధిపేట్‌లోని CSI చర్చిలో హరీష్ రావు క్రిస్మస్ వేడుకలు
X

harish

సిద్ధిపేట్‌లోని CSI చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి హరీష్‌ రావు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆరాధన మహోత్సవం, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. పండుగ శుభాకాంక్షలు తెలిపారు. CSI చర్చి ఆవరణలో ఫంక్షన్‌ హాల్ నిర్మాణం కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని మంత్రి హరీష్‌ ‌రావు హామీ ఇచ్చారు. సిద్ధిపేట్‌లో 40 లక్షల రూపాయలతో క్రైస్తవ భవనం నిర్మిస్తున్నాని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలంతా మంచిగా ఉండాలని ప్రార్థించిన హరీష్‌రావు, చెట్లు పెంచడంలో, ప్లాస్టిక్ నిషేధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Next Story

RELATED STORIES