‘ మత్తు వదలరా’ మూవీ రివ్యూ

‘ మత్తు వదలరా’  మూవీ రివ్యూ

mattu-vadalaraa-review

విడుదల తేదీ : డిసెంబర్ 25, 2019

నటీనటులు : శ్రీ సింహ, సత్య, వెన్నెల కిషోర్, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ తదితరులు

దర్శకత్వం : రితేష్ రాణా

నిర్మాత‌లు : చిరంజీవి(చెర్రీ), హేమలత

సంగీతం : కాల భైరవ

సినిమాటోగ్రఫర్ : సురేష్ సారంగం

ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్

స్టార్ డమ్ లు లేకపోయినా కీరవాణి కి తెలుగు పరిశ్రమలో మంచి పేరు ఉంది. బాహుబలి తో ఆపేరు ప్రపంచవ్యాప్తం అయ్యింది. ఆ కుటుంబం నుండి కీరవాణి తనయులు శ్రీసింహా హీరోగా, కాలభైరవ మ్యూజిక్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ మత్తు వదలరా’. ఒక సింపుల్ కాన్సెప్ట్ ని తీసుకొని ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో ‘మత్తు వదలరా’ టీం సక్సెస్ అయ్యింది. మరి కీరవాణి తనుయులు ఆడియన్స్ కి ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ ఇచ్చారో చూద్దాం...

కథ :

బాబు మోహన్ (శ్రీ సింహా) ఒక డెలివరీ బాయ్. ఎదుగు బొదుగు లేని జీవితం, చాలీ చాలని సంపాదనతో ఇబ్బందులు పడుతున్న బాబు తన ఫ్రెండ్ ఏసు(సత్య)ఇచ్చిన సలహాతో కస్టమర్స్ ని కనికట్టు చేసి డబ్బులు లాగడం ఎలాగో తెలుసుకుంటాడు. మనసొప్పకపోయానా ఆపని చేసేందుకు సిద్ద పడతాడు. కానీ మొదటి ప్రయత్నంలోనే అడ్డంగా దొరికిపోయి ఒక హాత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ క్రైమ్ కేసునుండి బయటపడేందుకు సాక్షాలను మాయం చేసేందుకు వెళ్ళిన బాబుకు అక్కడ మరో హాత్య కనపడతుంది. అసలు ఏంజరుగుతుంది అని తెలుసుకునేలోపు బాబు పరిస్థితి బయటకు రాలేనంతగా తయారవుతుంది. మరి బాబు అతని ఫ్రెండ్స్ ఈ క్రైమ్ నుండి ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన కథ..?

mattu-vadalaraa

కథనం:

ఒక రియలిస్టిక్ అప్రోచ్ కథను మొదలు పెట్టిన దర్శకుడు రితేష్ క్యారెక్టర్స్ ని చాలా నాచురల్ గా మలిచాడు. శ్రీ సింహా పాత్రను ను ప్రేక్షకులకు కనెక్ట్ చేసేందుకు కథలోని మలుపులను వాడుకున్నాడు తప్ప, ప్రత్యేక ప్రేమను చూపలేదు. అందుకే ఒక్కో సన్నివేశంలో సత్య పాత్ర బాగా డామినేటింగ్ అవుతుంది. సీరియల్స్ లోని క్యారెక్టర్సని మాత్రం ఒక ఆట ఆడుకున్నాడు. అతి డ్రామాను ఎంత యెటకారంగా చెప్పాలో అంత యెటకారంగా చెప్పాడు. ఇంతకు మించిన సెటైర్స్ సీరియల్స్ మీద వేయలేం అనేంతగా చేసాడు దర్శకుడు. నుదుటున బుల్లెట్ తగిలిన తర్వాత ఆ క్యారెక్టర్ చేసే కామెడీ అంతా ఇంతా కాదు.. ఇక పావలాశ్యామలా దగ్గర టర్న్ తీసుకున్న ‘మత్తు వదలరా’ కథనం సీన్ బై సీన్ కామెడీని పెంచుకుంటూ వెళ్లింది. హీరో ఇమేజినేషన్ లో కనిపించే ఫ్రెండ్స్ పాత్రలు చాలా ఎంటర్ టైన్ చేసాయి. డైలాగ్స్ కూడా అదిరిపోయాయి. సత్య టైమింగ్ తో డైలాగ్స్ తెచ్చిన పంచ్ లతో ‘మత్తు వదలరా’ చాలా సరదాగా సాగిపోయింది. ఒక క్రైమ్ సీన్ తర్వాత ఆ తప్పు ను సరిదిద్దుకునేందుకు హీరో చేసిన ప్రయత్నాలు అక్కడ ఎదురైన సంఘటనలు చాలా లాజికల్ గా తీసుకెళ్లాడు దర్శకుడు. డెలివరీ బాయ్స్ చేసే మోసాలు.. అపార్ట్ మెంట్ లలో పుట్టుకొస్తున్న గంజాయి తోటలు ఇన్సిపిరేషన్ తో కథను రెడీ చేసుకున్న దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని హాస్యంతో నింపడంతో సక్సెస్ అయ్యాడు. హాస్య నటుడు సత్య కి ఇది చాలా పెద్ద బ్రేక్ అని చెప్పవచ్చు. అలాగే శ్రీ సింహా, భైరవలకు కూడా ఇది సక్సెస్ పుల్ ఎంట్రీ గా మారింది. ఒక కొత్త టీం మంచి వినోదాన్ని అందించింది. వెన్నెల కిషోర్, బ్రహ్మజీ పాత్రలు నిడివి తక్కువే అయినా గుర్తిండిపోతాయి. డ్రగ్స్ తీసుకున్న మనుషులు ప్రవర్తన విజువలైజ్ చేయడంలో దర్శకుడు సృష్టించిన గందరగోళం కాస్త ఇబ్బంది పెట్టింది. శ్రీ సింహా ఒక లీడ్ ఆర్టిస్ట్ గానే కనిపించాడు.. సత్య నటన బాగా నవ్వించింది.

చివరిగా:

హాస్యపు మత్తులో సరదాగా కాసేపు గడపోచ్చు..

-కుమార్ శ్రీరామనేని

Tags

Read MoreRead Less
Next Story