గల్ఫ్ కంట్రీస్‌లో CAA, NRC ఎఫెక్ట్.. నిరసనల్లో పాల్గొన్న ఇండియన్స్ అరెస్ట్

గల్ఫ్ కంట్రీస్‌లో CAA, NRC ఎఫెక్ట్.. నిరసనల్లో పాల్గొన్న ఇండియన్స్ అరెస్ట్

gulf-item

ఇండియాలో దుమారం రేపుతున్న సిటిజెన్ అమెండ్మెంట్ యాక్ట్-CAA, NRC బిల్లులు గల్ఫ్ కంట్రీస్ లోనూ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ కంట్రీస్ లో ఇండియన్ ముస్లింలు CAA, NRC బిల్లులకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. చర్చలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే.. గల్ఫ్ కంట్రీస్ చట్టాల్లో ఇలాంటి నిరసనలకు తావులేదు. గల్ఫ్ చట్టాలపై దీంతో అవగాహన లేకుండా కొందరు ప్రవాసీయులు ఈ నిరనసల్లో పాల్గొని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అరెస్ట్ అవుతున్నారు.

సౌదీ అరేబియాలో తాజాగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. CAAతో పాటు ప్రతిపాదిత NRC బిల్లుల విషయంలో సోషల్ మీడియాలో కొందరు ఇండియన్లు అభ్యంతకర పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా అధికారుల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రియాద్‌లో సమావేశం కావటంతో వారిని సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే మలాజ్ లోని ఓ పాపులర్ హోటల్ లో సమావేశమైన ప్రవాసీయులు CAA బిల్లుపై డిబేట్ చేపట్టారు. వీళ్లంతా కేరళకు చెందిన వారే. సిటీజన్ అమెండ్మెంట్ యాక్ట్-CAA బిల్లుపై వాస్తవాలు-అపోహలు అనే కాన్సెప్ట్ తో ఈ మీటింగ్ జరిగింది. ఈ సమవేశంలో మలయాళి కమ్యూనిటీకి చెందిన లీగల్ ఎక్స్ పర్ట్ విక్రమ్ నానో పాల్గొని బిల్లుపై ప్రసంగించారు. అయితే..చర్చ సందర్భంగా సమావేశం చివరలో రభస చోటచేసుకోవటంతో విక్రమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

CAA బిల్లుకు సంబంధించి గత వారం రోజుల్లో చోటుచేసుకున్న రెండో ఇన్సిడెంట్ ఇది. వారం క్రితం జడ్డాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బీహార్‌కు చెందిన బ్లూ కాలర్ కార్మికులు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా బలాద్ లో సమావేశమయ్యారు. CAA, NRC బిల్లులకు వ్యతిరేకంగా ప్లకార్డుతో నిరసనలు తెలిపారు. దీంతో వారిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఉమ్రా సందర్శనలో ఉన్న యాత్రికులు CAA, NRC బిల్లులకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ వరుస ఘటనలతో గల్ఫ్ కంట్రీస్ లోని ఇండియన్ డిప్లమాట్స్ అలర్ట్ అయ్యారు. ఇక్కడి చట్టాలపై అవగాహన లేకుండా చిక్కుల్లో పడుతున్న ఇండియన్స్ కి పలు సూచనలు చేశారు. స్థానిక చట్టాలను అనుసరించి భారతీయులు ఎవరూ ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనందని సూచించారు. లోకల్ చట్టాలను, నిబంధనలను గౌరవించాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story