సీపీఐ 95వ వార్షికోత్సవాలు: మిలటెంట్ ఉద్యమాలకైనా సిద్ధమేనన్న చాడా

సీపీఐ 95వ వార్షికోత్సవాలు: మిలటెంట్ ఉద్యమాలకైనా సిద్ధమేనన్న చాడా

CPI

సీపీఐ 95వ వార్షికోత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. నారాయణగూడలోని AITUC భవన్‌ నుంచి మగ్దూం భవన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. 95వ వార్షికోత్సవం సందర్భంగా... 95 ఎర్ర జెండాలను ప్రదర్శించారు. సాయుధ పోరాటాల ద్వారా సంస్థానాధీశులను ఎదిరించి భూ సంస్కరణలు తెచ్చిన ఘనత కమ్యూనిస్టులదని... పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. కేంద్రంలో మతోన్మాద శక్తులు అధికారంలో ఉన్నాయని.. మతపరమైన రాజ్యం స్థాపించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అనేక పోరాటాలకు, త్యాగాలకు చిరునామా అయిన కమ్యూనిస్టు పార్టీ.. ప్రజల కోసం ఎల్లప్పుడూ పోరాడుతుందని.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌ రెడ్డి అన్నారు. మతోన్మాద చర్యలను అణచివేసేందుకు సిద్దం అవుతామని.. అవసరమైతే మిలటెంట్ ఉద్యమాలకు కూడా వెనకాడబోమని చాడా అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story