తాజా వార్తలు

దారుణం.. మహిళా రైతును చెట్టుకు కట్టేసి..

కరీంనగర్‌ జిల్లా మంథని మండలం శాస్రులపల్లిలో దారుణం జరిగింది. మహిళా రైతును చెట్టుకు కట్టేసి కొట్టారు ఆమె కౌలుదారులు. కిన్నెర అంజలికి చెందిన భూమిని.. అదే గ్రామానికి చెందిన మధునయ్య అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చింది. అయితే కౌలు తీసుకున్న సదరు వ్యక్తి ఈ భూమి తనదే అని.. పత్రాలపై సంతకాలు చేయాలంటూ మహిళా రైతును చెట్టుకు కట్టేసి విచక్షణ రహితంగా కొట్టాడు. తన తల్లి ఇంటికి రాకపోవడంతో ఆమె కుమారుడు పొలం దగ్గరకు వెళ్లి చూడగా.. మహిళా రైతు అంజలి అపాస్మరకస్థితిలో పడి ఉంది. ఆమెను వెంటనే మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES