మోడలింగ్ పేరుతో వల.. నరబలి, క్షుద్రపూజలతో భారీ స్కెచ్..

మోడలింగ్ పేరుతో వల.. నరబలి, క్షుద్రపూజలతో భారీ స్కెచ్..
X

model

అందంగా ఉన్న టీనేజ్ అమ్మాయిలకు అదో అందమైన రంగుల ప్రపంచం మోడలింగ్ రంగం. ఏ ఒక్క అవకాశం దొరికినా ఛాన్స్ మిస్సవకూడదనుకుంటారు. నేపాల్‌లో అయితే అవకాశాలు తక్కువ.. ఇండియాలో అయితే తన కల నిజమవుతుందని భావించింది 22 ఏళ్ల నేపాలీ బ్యూటీ. ఈ నేపథ్యంలో బీహార్‌కి చెందిన ఓ మహిళ కలిసి తానో మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నానని అందులో మోడల్‌గా అవకావం ఇస్తానంది. ఇండియాకు తీసుకువెళ్లి భోజ్‌పురి సినిమాల్లో ఆఫర్ వచ్చేలా చేస్తానంది. మహిళ మాటలు యువతికి వేదమంత్రాల్లా పని చేసాయి.

మహిళ తనతో పాటు మరో ఆరుగురు యువతులను నేపాల్ రాజధాని ఖాట్మండూ నుంచి బీహార్‌లోని జోగ్బానీకి తీసుకు వచ్చారు. ఈ విషయం నచ్చని మరో బ్యాచ్ మోడల్స్ పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. మోడలింగ్ పేరుతో నేపాల్ నుంచి ఓ మహిళ అమ్మాయిలను తీసుకు వచ్చింది అని పోలీసులకు కాల్ చేసి చెప్పారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రైడ్ చేశారు. వారిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న నగదు, 7 ATM కార్డులు, మొబైల్ ఫోన్స్, నరబలి, క్షుద్ర పూజలకు వాడే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

క్షుద్రపూజలు చేసే అలవాటున్న మహిళ నేపాల్ నుంచి తీసుకు వచ్చిన అమ్మాయిని సూర్యగ్రహణం రోజున బలి ఇవ్వాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇంతలో పోలీసుల దాడి జరిగింది. యువతి ప్రాణాలతో బయటపడింది. అయితే దీని వెనుక పెద్దల హస్తం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఆ మహిళకు పెద్ద మొత్తంలో సదరు వ్యక్తులు నగదు ముట్టజెప్పి ఉంటారని భావిస్తున్నారు. ఆ విషయాన్ని చేధించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అందుకే అందరి మాటలు నమ్మేయకూడదు.. అజాగ్రత్తగా ఉండకూడదు. ప్రమాదం ఏ రూపంలో అయినా పొంచి ఉండొచ్చు.

Next Story

RELATED STORIES