ఆంధ్రప్రదేశ్

నిడమర్రులో ఉద్రిక్తత.. బస్సు అద్దాలు పగలగొట్టిన రైతులు

నిడమర్రులో ఉద్రిక్తత.. బస్సు అద్దాలు పగలగొట్టిన రైతులు
X

srm

గుంటూరు జిల్లా నిడమర్రులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని మార్పును నిరసిస్తూ SRM యూనివర్సిటీ బస్సు అద్దాలను పగలగొట్టారు రైతులు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే అక్కడికి పోలీసులు భారీగా చేరుకున్నారు.

మరోవైపు రాజధానిలోని 29 గ్రామాల రైతులు ధర్నా చేసే ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీఎం, మంత్రులు వెళ్లే దారిలో దాదాపు 7 వందల మంది పోలీసులు మోహరించారు. మందడంలో దుకాణాలను తెరిచేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సచివాలయానికి వెళ్లేదారిలో టియర్ గ్యాస్, వాటర్ కెనాన్, అగ్నిమాపక దళాలను మోహరించారు. తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ప్రతి గ్రామంలోనూ పికెటింగ్ ఏర్పాటు చేశారు. రైతులు ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story

RELATED STORIES