ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలకుపైగా భేటీ జరిగింది. జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రి వర్గం సుధీర్ఘంగా చర్చించింది. రాజధాని ప్రాంత రైతులకు ఎలా న్యాయం చేయాలి? హైకోర్టు తరలింపు విధి విధానాలపై సమావేశంలో చర్చించారు. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటు సహా.. జీఎన్ రావు కమిటీలో ప్రస్తావించిన అంశాలపై మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు సీఎం జగన్. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కేబినెట్ సబ్‌కమిటీ సీంఎంకు రిపోర్టు ఇచ్చింది. అయితే రాజధాని మార్పుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. జీఎన్‌రావు కమిటీ నివేదికపైనే చర్చించామని.. బోస్టన్ గ్రూప్ కన్సల్టెన్సీ నివేదిక వచ్చిన తరువాత రాజధానిపై తుది ప్రకటన ఉంటుందని మంత్రులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రకటన కోసం రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
రాజధానిపై హైపవర్ కమిటీ నివేదిక తర్వాతే మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. జనవరి 18 తర్వాత హై పవర్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. జీఎన్‌రావు రిపోర్ట్‌తోపాటు దాన్నికూడా పరిశీలించాక తుది నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. జనవరి 3న బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జనవరి 3వ వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉంది ప్రభుత్వం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com