కాంగ్రెస్ ప్రజ్లలోకి వెళ్లాలంటే భయపడుతోంది - కేటీఆర్

ప్రజల ఆశీర్వాదంతో మన్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని అన్నారు మంత్రి కేటీఆర్. సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎజెండాగా ముందుకు వెళ్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా మున్సిపాల్టీలకు నిధులిచ్చామని తెలిపారు. టీఆర్ఎస్ భవన్‌లో జరిగిన రాష్ట్రకార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టారని అన్న కేటీఆర్.. వారి అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
ప్రతిపక్షాలపైనా విమర్శలు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రజ్లలోకి వెళ్లాలంటే భయపడుతోందని విమర్శించారు..విపక్షాల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా తయారైందని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com