ప్రభాస్ పెళ్లి.. వచ్చే ఏడాది.. పెద్దమ్మ క్లారిటీ..

ప్రభాస్ పెళ్లి.. వచ్చే ఏడాది.. పెద్దమ్మ క్లారిటీ..
X

prabhas-marriage

ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులు ముచ్చటించుకోవడం మానేశారు. ఒకప్పుడు అనుష్కని చేసుకుంటాడేమో అని ఆసక్తి కనబరచిన అభిమానులు మా ఇద్దరి మధ్యా అదేం లేదు.. అదంతా తూచ్ అని చెప్పడంతో సర్లే మనకెందుకు అని ఊరుకున్నారు. కానీ అతడి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కనబడగానే వేసే మొదటి ప్రశ్న ప్రభాస్‌కి పెళ్లెప్పుడు అని. ఈ విషయంలో ఇప్పటికే ప్రభాస్ పెద్దమ్మ.. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి అనేక సార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ మరోసారి ఇదే వార్తపై స్పందించారు. సాహో తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందేమో అని అనుకున్నారంతా.. కానీ అది వచ్చింది.. వెళ్లిపోయింది. ప్రభాస్ మాత్రం పెళ్లి పీటలు ఎక్కట్లేదు. పెద్దమ్మను ఇదే విషయంపై ప్రశ్నిస్తే.. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నాడు. అది అయిన తరువాత పెళ్లి ఉంటుందన్నారు. ఇంతకీ అమ్మాయి ఎవరనేది మాత్రం సస్పెన్స్‌గానే కొనసాగుతోంది. మా కుటుంబంలో కలిసి పోయే అమ్మాయి అయితే మాకు హ్యాపీ అని ఇదివరకే శ్యామల చెప్పారు.

Next Story

RELATED STORIES