ఆంధ్రప్రదేశ్

నేడు విశాఖపట్నంలో పర్యటించనున్న సీఎం జగన్‌

నేడు విశాఖపట్నంలో పర్యటించనున్న సీఎం జగన్‌
X

Screenshot_1

ఏపీ సీఎం జగన్‌ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం రెండున్నరకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్తారు. కైలాసగిరి వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సెంట్రల్‌ పార్కు వద్ద పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. సాయంత్రం రామకృష్ణ బీచ్‌లో విశాఖ ఉత్సవ్‌-2019 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

మరోవైపు విశాఖ ఉత్సవ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. నేడు, రేపు ఉత్సవాలు నిర్వమిస్తారు.. ఈరోజు మధ్యాహ్నం బీచ్‌ రోడ్‌లోని పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ నుంచి కార్నివాల్‌ ప్రారంభమవుతుంది. ఇందులో శకటాలు, వివిధ కళారూపాలు, జానపదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.. అనంతరం సాయంత్రం 5.30కు ఆర్కే బీచ్‌లో ఉత్సవ్‌ను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి..

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పార్టీ నేతలు, అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తొలిసారి ముఖ్యమంత్రి విశాఖ రానుండటంతో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.

Next Story

RELATED STORIES