తిరుపతిలో బాంబు పేలుడు కలకలం

తిరుపతిలో బాంబు పేలుడు కలకలం
X

bomb-blast

తిరుపతిలో బాంబు పేలుడు కలకలం రేపింది.. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో పేలుడుతో రోగులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు.. ఓ శునకం నాటు బాంబును నోట్లో పెట్టుకుని వెళ్తుండగా అది ఒక్కసారి పేలిపోయింది. దీంతో శునకం అక్కడికక్కడే చనిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్‌ స్క్వాడ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఘటనా స్థలంలో లభించిన మరో నాలుగు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో నాటు బాంబులు ఎవరు పెట్టారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story