పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర నిపుణుల కమిటీ

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర నిపుణుల కమిటీ

polavaram

పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును.. కేంద్ర నిపుణుల కమిటీ ఆదివారం సందర్శించింది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కమిటీ నిపుణులు స్వయంగా పరిశీలించారు. గత కొద్ది నెలలుగా పోలవరం పనులు నిలిచిపోయాయి. పాత కాంట్రాక్ట్‌ సంస్థ నవయుగను తప్పించి మెఘా ఇంజినీరింగ్‌కు నిర్మాణ బాధ్యత అప్పగించడంతో... ప్రస్తుత పరిస్థితిని నిపుణుల బృందం పరిశీలించింది. గతంలో సందర్శించినపుడు.. తాము ఇచ్చిన సూచనలనుపాటిస్తున్నది లేనిదీ ... ఇరిగేషన్‌ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు బృంద సభ్యులు. ప్రాజెక్ట్‌లో కీలకమైన స్పిల్‌వే, స్పిల్‌ ఛానెల్‌, గేట్ల నిర్మాణం, ఎగువ-దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను కమిటీ పరిశీలించింది. నిపుణుల కమిటీ చైర్మన్‌ ఎస్‌.కె. హల్దార్‌, ఆర్కే పచౌరి, ఎస్ఎల్‌ గుప్తా, డి.రంగారెడ్డి, బీపీ పాండేతోపాటు ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ సాంకేతిక నిపుణులు డీపీ భార్గవ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story