ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో మరోసారి అన్యమత ప్రచారం కలకలం

శ్రీశైలంలో మరోసారి అన్యమత ప్రచారం కలకలం
X

srisailam

నిత్యం శివనామ స్మరణతో మార్మోగే శ్రీశైలంలో మరోసారి అన్యమత ప్రచారం కలకలం రేపింది. ఆలయ సమీపంలోని రుద్రా పార్క్‌ దగ్గర బైబిల్‌ పట్టుకుని నలుగురు వ్యక్తులు ప్రార్థనలు చేశారు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన తిమోతి, మహబూబ్‌నగర్‌ జిల్లా అమ్రాబాద్‌కు చెందిన ప్రవీణ్‌తో పాటు సున్నిపెంటకు చెందినజాషువా, మట్టా పీటర్‌గా పోలీసులు గుర్తించారు. ఆ నలుగురి వద్ద నుంచి క్రైస్తవ మతానికి చెందిన పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. దేవస్థానం పరిధిలో అన్యమత ప్రచారం చేయడం, అన్యమత గ్రంథములు కలిగి ఉండటం నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు, పోలీసులు హెచ్చరించారు.

Next Story

RELATED STORIES