తాజా వార్తలు

ఏంటి.. నిజంగానే.. ఫోన్ కొంటే టీవీ ఫ్రీనా!!

ఏంటి.. నిజంగానే.. ఫోన్ కొంటే టీవీ ఫ్రీనా!!
X

lg

అవునండి.. అవును.. మీరు విన్నది నిజమే.. ఫోన్ కొంటే టీవీ ఫ్రీ.. క్లియరెన్స్ సేల్ అనుకోండి, మరొకటి అనుకోండి.. లేదంటే కొత్త సంవత్సరంలో కొనుగోలుదారులను మరింత పెంచుకోవాలనే ఉద్దేశం కూడా కావచ్చు. ఏదైతేనేం కొన్ని కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి. ఆఫర్ల విషయంలో మరింత ముందుకెళ్లిన ఓ కంపెనీ తమ సెల్ ఫోన్ కొంటే టీవీ ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు ఒకసారి ఫ్రీ సర్వీస్ కూడా చేస్తామని ప్రకటించింది. దాంతో పాటు రీ ప్లేస్‌మెంట్ సదుపాయం కూడా ఉందంటోంది.

అదేమీ ఆషామాషీ కంపెనీ కాదు కొరియా దేశానికి చెందిన LG కంపెనీ ఈ ఆఫర్‌ని తీసుకువచ్చింది. ఈ మధ్యే మార్కెట్లోకి వచ్చిన LG G8X పై ఈ ఆఫర్‌ని అందిస్తోంది. రూ.49,999 పెట్టి ఈ ఫోన్ కొంటే.. 24 ఇంచుల LG LED TV ఫ్రీగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్ 15 జనవరి 2020 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండింటిలో ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫోన్ కొనుగోలు చేసిన తరువాత జనవరి 15 లోపు LG వెబ్‌సైట్‌లో పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు టీవీ మీ ఇంట్లో ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం.

Next Story

RELATED STORIES