విజయవాడలోని ధర్నా చౌక్‌లో అమరావతి పరిరక్షణ సమితి నిరసన దీక్ష

X

ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌లో నిరసన దీక్ష చేపట్టారు. ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమైనదని మండిపడుతున్నారు. 13 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ బోగస్ అని.. అందులో అందరూ వైసీపీ ప్రజా ప్రతినిధులే ఉంటే ఎలాంటి రిపోర్టు వస్తుందో ఊహించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం స్పందించే వరకు ప్రతి రోజు నిరసన దీక్ష చేపడతామని స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
