తాజా వార్తలు

తెలంగాణలో ఊపందుకుంటున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

తెలంగాణలో ఊపందుకుంటున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం
X

trs-vs-congress

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి తెలంగాణ పార్టీల్లో కదలిక ఊపందుకుంటోంది. నోటిఫికేషన్ నాటి నుంచే మిగిలిన పార్టీల కంటే ప్రచార రేసులో ముందుగా బరిలోకి దిగింది టీఆర్ఎస్. ఇక ప్రచార ఫ్లోనూ కంటిన్యూ చేస్తోంది. ఎన్నికలు ఏవైనా విజయం తమదే అన్నట్లుగా అలవాటు చేసుకున్న టీఆర్ఎస్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. మెజారిటీ మున్సిపల్, కార్పోరేషన్లలో తమదే విజయమనే ధీమాతో ఉంది కేడర్.

సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్న మంత్రులు..హైదరాబాద్ శివారులోని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జరిగిన టీఆర్‌ఎస్‌ మహిళ చైతన్య సదస్సుకు హజరయ్యారు. టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా పెంచామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గురుకులాలతో బీసీ, ఎస్సీ,ఎస్టీలకు కూడా నాణ్యమైన విద్య అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు మంత్రి మల్లారెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ దివాళా తీసిందని, ఇక బీజేపీకి అసలు అభ్యర్ధులే లేరని ఆరోపించారు.

అటు కాంగ్రెస్ కూడా మున్సిపల్ ఎన్నికలకు సమయత్తం అవుతుంది. సన్నాహక సభలతో కేడర్‌లో జోష్‌ పెంచే ప్రయత్నం చేస్తుంది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సభకు హజరైన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ కుంతియా..టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాల్లో అన్ని మున్సిపాలిటీలను గెలించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను.. కేసీఆర్‌ అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.

Next Story

RELATED STORIES