జనవరి 3కు సమత కేసు విచారణ వాయిదా

జనవరి 3కు సమత కేసు విచారణ వాయిదా
X

saMATA

ఆసిఫాబాద్‌ జిల్లాలో అత్యాచారం, హత్యకు గురైన సమత కేసులో సాక్షుల విచారణ పూర్తైంది. ఇప్పటి వరకు మొత్తం 44 మందిలో 25 మందిని స్పెషల్‌ కోర్టు విచారించింది. తదుపరి విచారణను జనవరి మూడో తేదీకి వాయిదా వేసింది. మంగళవారం ఐదుగురు సాక్షులతో పాటు నిందితులను కోర్టు విచారించింది. ఆసిఫాబాద్‌ డీఎస్పీ సహా ఐదుగురు పోలీసు అధికారులను విచారించారు. జనవరి 3 న తదుపరి విచారణ జరగనుండగా.. జనవరి 6 వ తేదీన మరోసారి వాదనలు జరగనున్నాయి. అనంతరం 10 వ తేదీలోపే సమత కేసులో స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించబోతున్నారు.

Tags

Next Story