అర్థరాత్రి వరకు పార్టీలు చేస్కోండి.. మేమున్నామంటున్నాయి మెట్రో రైళ్లు..

అర్థరాత్రి వరకు పార్టీలు చేస్కోండి.. మేమున్నామంటున్నాయి మెట్రో రైళ్లు..

new-year

అప్పటి వరకు కబుర్లు కాలక్షేపం.. మందు పార్టీలు.. విందు భోజనాలు.. అర్థరాత్రి 12 అయిన తరువాత కేకులు కట్ చేసి న్యూఇయర్ విషెస్ చెప్పుకుని మరోసారి ఛీర్స్ చెప్పాలి. ఓ చుక్క ఎక్కువేసి ఇంటికి బయల్దేరే వారి కోసం భరోసా ఇస్తున్నాయి.. మేమున్నాం మీకేం పర్లేదు.. గంట కాకపోతే ఇంకో రెండు గంటలు ఉండండి.. మీ కోసం స్పెషల్ ట్రైన్స్ వేస్తున్నాం అంటున్నారు అధికారులు. లింగంపల్లి నుంచి అర్థరాత్రి 1.30 గంటలకు బయలుదేరి ఫలక్‌నుమాకు 2.55 గంటలకు చేరుతుంది. లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక సర్వీస్ నడుపుతున్నారు. ఇది రాత్రి 1.15కు బయలుదేరుతుంది.

ఇక మెట్రో రైళ్ల విషయానికి వస్తే మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మద్యం ఎక్కువైతే బండెక్కి ఇంటికి చేరుకోవడం కష్టమేమో కానీ మెట్రో ఎక్కితే హ్యాపీగా వెళిపోవచ్చంటున్నారు. అందుకే మెట్రో చివరి రైలు ఒంటి గంటకు బయలు దేరి తెల్లవారుజామున రెండుగంటలకు చేరుతుందన్నారు. మందు బాబులు మద్యం మత్తులో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు పోలీసులు వారిపై ఓ కన్నేసి ఉంచుతారట.

Read MoreRead Less
Next Story