హైదరాబాద్‌కు ధీటుగా అమరావతి నిర్మాణం తలపెట్టా: చంద్రబాబు

హైదరాబాద్‌కు దీటుగా అమరావతి నిర్మాణం తలపెట్టానని చంద్రబాబు అన్నారు. తనపై నమ్మకంతో రైతులు 33వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి గ్రామాల్లో సతీసమేతంగా పర్యటిస్తున్న ఆయన తొలుత ఎర్రపాలెంలో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేశానని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబానికి సమయం కూడా కేటాయించలేదని అన్నారు. మనవడితో ఆడుకునేందుకు టైమ్ ఇవ్వలేకపోయానని గుర్తుచేశారు. అమరావతిని ప్రతి ఒక్కరు కలిసి రక్షించుకోవాలని పిలుపునిచ్చారాయన.
ఒక సామాజిక వర్గానికి లబ్ది చేకూర్చేందుకే అమరావతిని తెరపైకి తెచ్చానంటూ వైసీపీ నాయకులు అబద్ధాలు చెప్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎర్రపాలెంలోని ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో.. వాళ్ల జనాభా ఎంతో చదివి వినిపించారు. 75 శాతం మంది వీకర్ సెక్షన్ ఉంటే.. వైసీపీ నాయకులకు కనిపించలేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com