ఆద్య.. అచ్చం నాన్నలాగే ఉంటుంది: రేణూ ట్వీట్

ఆద్య.. అచ్చం నాన్నలాగే ఉంటుంది: రేణూ ట్వీట్
X

aadhya,-pawan

నిన్నగాక మొన్న రేణూ దేశాయ్ కొడుకు అకీరా, కూతురు ఆద్య ఫోటోలను షేర్ చేశారు. వాటిని చూసి ఓ నెటిజన్ ఎంతైనా పవన్ రక్తం కదా అని అనేసరికి రేణూ ఫీలయ్యారు. వాళ్లు నా పిల్లలు వాళ్లలో ప్రవహించేది నా రక్తం అంటూ చిరుకోపం తెచ్చుకున్నారు. అలాంటిది పవన్‌తో ఆద్య కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ పిల్లలు తల్లిదండ్రుల నుంచి పోలికలు లాగేసుకుంటారు. ఇదో మ్యాజిక్. నా కూతురు ఆద్య అప్పుడప్పుడూ నాన్నలాగే ఉందనిపిస్తుంది. ఎక్కువ సార్లు వాళ్ల నానమ్మ, నాన్నలా కనిపిస్తుంది. ఏమైనా ఆద్య నా కెమెరాకి నచ్చిన వ్యక్తి అంటూ పోస్ట్‌లో తెలిపారు రేణూ దేశాయ్. ఇన్నాళ్లూ పవన్ మాటెత్తితే ఇష్టపడని రేణూ సడెన్‌‌గా ఇలా ప్లేటు మార్చి ఫోటో షేర్ చేయడమే కాకుండా.. పవన్ గురించి ప్రస్తావించడంతో నెటిజన్స్‌లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Next Story

RELATED STORIES