నుమాయిష్‌ కోసం రాత్రి 11.30 వరకు మెట్రో ట్రైన్లు

నుమాయిష్‌ కోసం రాత్రి 11.30 వరకు మెట్రో ట్రైన్లు

numaish

హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ సందర్భంగా ప్రఖ్యాత నుమాయిస్‌ ప్రారంభమైంది. 80వ ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ను మంత్రులు మహ్మద్‌ ఆలీ, తలసాని, ఈటెల, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలసి ప్రారంభించారు. జనవరి వచ్చిదంటే హైదరాబాద్‌ గుర్తొచ్చేలా నుమాయిష్‌ను తీర్చిదిద్దుతామన్నారు మంత్రి ఈటెల. హైదరాబాద్‌ నుమాయిష్‌ దేశవ్యాప్తంగా ఆదరణ ఉందన్నారాయన.

నుమాయిష్‌ 80వ వసంతంలోకి అడుగుపెట్టడం సంతోషకరమన్నారు మంత్రి తలసాని. గత ఏడాది ప్రదర్శనలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఫిబ్రవరి 15 వరకు మొత్తం 46 రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్‌ ఉంటుంది. దాదాపు రెండువేల వరకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ నుమాయిష్‌ సందర్భంగా రాత్రి 11.30 వరకు ట్రైన్లను కొనసాగించాలని మెట్రో నిర్ణయించింది.

మరోవైపు గతేడాది జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 3 కోట్ల రూపాయలతో 2 కిలోమీటర్ల మేర అండర్‌ గ్రౌండ్‌లో ఫైర్‌ సేఫ్టీ కేబుల్స్‌, ఫైర్‌ ఇంజన్లను సిద్ధం చేశారు. 25 శాతం ఆదాయం తగ్గుతున్నప్పటికీ భద్రతా ప్రమాణాలకే ప్రాధాన్యమిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story