ఏపీ రాజధానిపై ఆరెస్సెస్‌ నేత రతన్‌ శార్దా కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజధానిపై ఆరెస్సెస్‌ నేత రతన్‌ శార్దా కీలక వ్యాఖ్యలు

amaravati

ఏపీ రాజధాని విషయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు వ్యాఖ్యలపై వివాదాస్పదమవుతున్నాయి. రాజధానిపై కేంద్రం జోక్యం ఉండదన్నారాయన. ఇది కేంద్ర పరిధిలోనిది కాదన్నారు. దక్షిణాదిలో ఐదు రాష్ట్రాలకు తానే ప్రతినిధినన్న జీవీఎల్‌.. కేంద్రం అమరావతిలో రాజధాని పెట్టమని ఎప్పుడు చెప్పలేదన్నారు. అలాగే పెట్టవద్దని కూడా చెప్పలేదన్నారు. తాను చెప్పిందే ఫైనల్‌ అంటూ ఘాటుగా చెప్పారు. అంతే కాదు.. బీజేపీ నేతలు కూడా కొంతమంది టీడీపీ పల్లవి అందుకుని.. కేంద్రానికి ఫిర్యాదు చేస్తామంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు. అసలు బీజేపీ స్టాండ్‌ ఎంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు జీవీఎల్‌.

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదంటూ జీవీఎల్‌ చేసిన వ్యాఖ్యలపై.. RSS ప్రధాన కార్యదర్శి రతన్‌ శార్దా ఆభ్యంతరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ లైన్‌ను.. యూపీ నుంచి ఎన్నికైన ఎంపీ నిర్ణయించడమేంటని ప్రశ్నించారు. మత మార్పిడులను ప్రేరేపించే శక్తులు ఉన్న రాష్ట్రంలో హిందువులు స్వధర్మం కోసం సంఘర్షణ చేయాలని భావిస్తున్నారా అని నిలదీశారు.? అలాంటి పోరాటం చేసే శక్తి హిందువుల్లో ఉందంటూ ఉద్వేగంగా ట్వీట్‌ చేశారు రతన్‌ శార్దా. మొత్తానికి అమరావతిపై తలో మాట మాట్లాడటంతో.. ఏపీ బీజేపీలో అయోమయం నెలకొంది. మరి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story