చిరంజీవితో స్టెప్పులా.. నో.. నెవ్వర్..

చిరంజీవి సినిమాలో ఆఫర్ వస్తే ఓ మంచి అవకాశంగా భావించాల్సింది పోయి మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేసింది హీరోయిన్ రెజీనా కసాండ్రియా. అదే మరో హీరోయిన్ అయితే ఎగిరి గంతేసేదేమో. మరి ఇంతకీ రెజీనా ఎందుకు నో చెప్పిందో తెలుసుకుంటే.. ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా ప్రతి నాయిక పాత్రలు, విభిన్న కథలతో రూపొందుతున్న చిత్రాల్లో నటిస్తోంది. ఇలాంటి సమయంలో మరి చిరంజీవి సినిమాలో వచ్చిన ఆపరేమో ఐటమ్ సాంగ్ చేయమని. అందుకే చేయనని చెప్పింది. నా ఇమేజ్‌కి డ్యామేజ్ అవుతుంది అలాంటివి చేస్తే అంటూ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. మరి ఈ వార్తలో నిజమెంతో రెజీనా నోరు విప్పితే కాని తెలుస్తుంది. దేవాదాయ శాఖలో జరిగే అవినీతిని అరికట్టే పాత్రలో చిరు నటిస్తుండగా, ఆయన పక్కన హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com