తాజా వార్తలు

గవర్నర్‌కు పల్లెప్రగతి కార్యక్రమం గురించి వివరించిన సీఎం కేసీఆర్

గవర్నర్‌కు పల్లెప్రగతి కార్యక్రమం గురించి వివరించిన సీఎం కేసీఆర్
X

kcr-meets-governor

సీఎం కేసీఆర్‌‌.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్‌. ఈ సందర్భంగా.. గవర్నర్‌కు పల్లెప్రగతి కార్యక్రమం గురించి వివరించారు. గురువారం నుంచి మొదలయ్యే పల్లెప్రగతి లక్ష్యాల గురించి గవర్నర్‌కు తెలిపారు. మొదటి విడత పల్లెప్రగతి పురోగతి, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలపై గవర్నర్‌కు విరించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా నీటి ఎత్తిపోతల పనుల పురోగతి గురించి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులు గొప్పగా ఉన్నాయన్నారు గవర్నర్‌ తమిళసై. ఇకపై జరగబోయే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవ్వాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం.. పల్లె నుంచి పట్టణం వరకు అన్ని అభివృద్ధి పథకాలు అమలు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రానికి ఇంత గొప్ప సేవ చేస్తోన్న సీఎం కేసీఆర్‌ ధన్యుడన్నారు గవర్నర్‌ తమిళసై.

Next Story

RELATED STORIES