గుంటూరులో కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరి పరిస్థితి విషమం

X
By - TV5 Telugu |3 Jan 2020 3:21 PM IST
గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ గొడవలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి నవీన్ బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. గాయాలతో ఉన్న నవీన్‌ను తోటి విద్యార్థులు ఆస్పత్రికి తీసుకొచ్చినా పరిస్థితి మెరుగుపడలేదు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమించింది. ఇంత జరిగినా కాలేజీ యాజమాన్యం స్పందించలేదంటూ.. విద్యార్థి సంఘాలు ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగాయి. నవీన్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అటు, కొత్తపేటలోని కాలేజీ వద్దకు వెళ్లిన బంధువులంతా ధర్నాకు దిగారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని న్యాయం చేయాలని కోరుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com