అశాంతి సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోంది: కేంద్రమంత్రి

అశాంతి సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోంది: కేంద్రమంత్రి
X

gajendra

దేశంలో అశాంతి సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందన్నారు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. కడప జిల్లాలో పర్యటించిన మంత్రి.. మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు, ముస్లీం మహిళలకోసం త్రిబుల్ తలాక్ తెచ్చిన ఘనత మోదీ సర్కారుదేనన్నారు. దేశ భద్రతకోసం చట్టాలు తెస్తే.. వ్యతిరేకించడం తగదన్నారు. శరణార్ధులకు పౌరసత్వం కల్పించే సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ చట్టానికి అందరు మద్దతు తెలపాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో పలువురు బీజేపీ పార్టీలో చేరారు.

Next Story

RELATED STORIES