మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్

మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్

tcongress

మున్సిపల్ ఎన్నికల్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ మున్సిపాలిటీలు కాకున్నా కనీసం గౌరవప్రదమైన సంఖ్యను సాధించాలని భావిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. ఈ మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల తో పాటు అన్ని జిల్లాలకు సమన్వయ కమిటీలను నియమించింది కాంగ్రెస్.

పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులతో ఏర్పాటైన సమన్వయ కమిటీలు .. తమకు అప్పజెప్పిన బాధ్యత లో నిమగ్నమయ్యారు. ఈ నెల 4, 5 తేదీల్లో లో అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో క్షేత్ర స్థాయి సమీక్ష జరిపేందుకు సమన్వయ కమిటీలు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి. ఈ సమీక్షలో స్థానిక నేతలతో మమేకమై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనున్నారు. మున్సిపాలిటీల వారీగా స్థానిక సమస్యలను ఐడెంటిఫై చేయడం దానికి అనుగుణంగా ఎన్నికల ప్రచార సరళి రూపొందించేందుకు పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు సమన్వయ కమిటీ సభ్యులు.

ఇక మున్సిపల్ ఎన్నికల కోసం పిసిసి ఏర్పాటు చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు మ్యానిఫెస్టో రూపకల్పనలో నిమగ్నమయ్యారు. మున్సిపల్ ఓటర్లను ఆకర్షించేలా మ్యానిఫెస్టో కసరత్తులు ప్రారంభించారు మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు. గాంధీభవన్లో లో మ్యానిఫెస్టో కమిటీ తొలి సమావేశం లో కమిటీ చైర్మన్ మాగం రంగారెడ్డి సభ్యుల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు సేకరించారు.

ఈ మున్సిపల్ ఎన్నికల్లో కారు స్పీడుకు బ్రేకులు వేసేలా పక్కా ప్రణాళికలతో గ్రౌండ్లో దిగేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరి పట్టణ ప్రజల కరుణ కాంగ్రెస్ పై ఏ మేరకు ఉంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story