మంచు దుప్పటి కప్పుకున్న సిమ్లా

X
TV5 Telugu4 Jan 2020 6:17 AM GMT
సిమ్లా మంచు తెరలు కప్పుకుంది. జలపాతాలు సైతం గడ్డకట్టుకుపోయాయి. అసలు అక్కడి నదులు, జలపాతాలను చూడగానే.. అంటార్కిటికాలో ఉన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. లేదా ఐస్ ఏజ్ సినిమా షూటింగ్ ఇక్కడే జరిగిందా అనే డౌట్ వస్తుంది. మంచుగా మారిన జలపాతం అంత అందంగా కనిపిస్తోంది.
సాధారణంగా హిల్‌స్టేషన్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పస్థాయికి పడిపోవడంతో నదులు, సరస్సులు గడ్డకట్టుకుపోతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలతో చలితీవ్రత పెరగడంతో నదులు, జలపాతాలు పాక్షికంగా గడ్డకట్టుకుపోతున్నాయి. ఆ దృశ్యాలు చూసేందుకు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి.
Next Story