వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పైలట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం..

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పైలట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం..

ysr-arograsri

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పైలట్‌ ప్రాజెక్టుకు సీఎం జగన్‌.. పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన జగన్‌ కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, నారాయణ స్వామి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు పాల్గొన్నారు.

ఏలూరులో 2007లో నాటి సీఎం వైఎస్‌ ఆరోగ్యశ్రీని ప్రారంభించగా.. ఈ రోజున ఇక్కడి నుంచే ఆరోగ్యశ్రీ విస్తరించడం సంతోషంగా ఉందన్నారు జగన్‌. 3 నెలలు పైలట్‌ ప్రాజెక్ట్‌గా పరిశీలించి.. ఇతర జిల్లాల్లో విస్తరిస్తామన్నారు. క్యాన్సర్‌కు ఫిబ్రవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండ వైద్యం అందిస్తామన్నారు. కోటి 45 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి... వాటికి QR కోడ్‌ జారీచేస్తామన్నారు. డయాలసిస్ పేషెంట్లతోపాటు తలసేమియా, సిన్ సెల్‌ ఎనీమియా, హిమో ఫీలియా బాధితులకు నెలకు 10 వల పెన్షన్ ఇస్తామన్నారు జగన్‌. ఆసుపత్రి పారిశుద్ధ కార్మికులకు 16 వేలు జీతాలు పెంచుతూ సీఎం ప్రకటన చేశారు. ఈ నెల 9న అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సిఎం చెప్పారు. అటు ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని జగన్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story