Top

ESI స్కామ్‌ దర్యాప్తులో తాజాగా అప్ డేట్..

ESI స్కామ్‌ దర్యాప్తులో తాజాగా అప్ డేట్..
X

esi-medical-scam

ESI స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. లెజెండ్ షెల్‌ కంపెనీకి కృపాసాగర్‌ను ఓమ్ని చైర్మన్‌ శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జి బినామీగా చేర్చినట్టు అధికారుల విచారణలో తేలింది. క్యూ వైట్‌ అనే వైట్‌ బ్లడ్‌ శాంపిల్స్‌ గోల్‌మాల్‌లో 2017-18 సంవత్సరంలో 23 కోట్ల విలువగల 6 వేల 291 యూనిట్లను పంపినట్టు డాక్యుమెంట్స్‌ లభించాయి. అసలు ధర కంటే 2 వందల శాతం ఎక్కువ ధరకు క్యూవేట్‌ పరికరాలను సంస్థ విక్రయించినట్టు తేలింది. అసలు ధర 11 వేల 8 వందలు ఉంటే... 36 వేల 8 వందలకు అమ్మి సర్కారీ సొమ్మును కాజేశారు అక్రమార్కులు. దీంతో...11 కోట్ల ప్రభుత్వ సొమ్మును శ్రీహరి అండ్‌ కో అడ్డంగా దోచేశారు.

డ్రగ్‌ కంట్రోల్‌, కమర్షియల్‌ టాక్స్‌, అఫీస్‌ అడ్రెస్‌కు సంబంధించిన 3 వేర్వేరు అడ్రెస్‌లను లెజెండ్‌ కంపెనీ నమోదు చేసింది. స్విట్జర్లాండ్‌ కంపెనీ అయిన హీమోక్యూ కంపెనీలో ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్‌... కంపెనీకి తెలియకుండా ఫేక్ ఆథరజైసేన్ లెటర్ తయారు చేసినట్టు తేలింది. ఈ వ్యవహారంలో ఓమ్మి చైర్మన్‌ శ్రీహరిబాబు, హిమోక్యూ ఏరియా మేనేజర్‌ వెంకేటేష్‌ను అరెస్టు చేసి ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు లెజెండ్‌ కంపెనీ యజమానిగా ఉన్న కృపాసాగర్‌ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. కృపాసాగర్‌ను విచారిస్తే.. మరిన్ని అక్రమాలు బయపటడే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES