తెలంగాణలోని కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్ల ఖరారు

తెలంగాణలోని కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్ల ఖరారు

telangana

తెలంగాణలోని కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 13 కార్పొరేషన్లలో ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, బీసీలకు 4, జనరల్‌కు 7 స్థానాలు కేటాయించారు. 123 మున్సిపల్‌ చైర్మన్‌లో ఎస్టీలకు 4, ఎస్సీలకు 17, బీసీలకు 40, జనరల్‌కు 62 స్థానాలు కేటాయించారు. రిజర్వేషన్లను సంబంధించిన వివరాలను పురపాలక శాఖ డైరక్టర్‌ శ్రీదేవి తెలిపారు.

ఎస్టీ రిజర్వేషన్ మొత్తం జనాభా పై ఆధారపడి ఉంటుందన్నారు. ఎస్సీ రిజర్వేషన్‌ కూడా వారి మొత్తం జనాభా ఆధారంగా ఉంటుందని తెలిపారు. బీసీలో జనాభా కాకుండా బీసీ ఓటర్లు పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్‌కల్పించామన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కల్పిస్తామన్నారు. 128 మున్సిపాలిటీల్లో జడ్చర్ల, నకిరేకల్‌కు ఇంకా సమయం ఉందన్నారు శ్రీదేవి. పాల్వంచ, మందమర్రి, మణుగూరుకు రిజర్వేషన్‌ ప్రకటించలేదు. ఇవే రిజర్వేషన్లు తరువాత ఎన్నికల్లో కూడా వర్తిస్తాయన్నారు.

మున్సిపల్‌ రిజర్వేషన్లు ఖరారు

13 కార్పొరేషన్లలో ఎఎస్సీలకు-1, ఎస్సీలకు-2

బీసీలకు -4, జనరల్‌కు -7

123 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు-4, ఎస్సీలకు 17,

బీసీలకు-40, జనరల్‌కు-40

మొత్తం జనాభాలో

1.9 ఎస్టీ జనాభా 3.25% రిజర్వేషన్లు

3.6 ఎస్సీ జనాభా. 14% రిజర్వేషన్లు

32.5 % జనాభా, 33 శాతం రిజర్వేషన్లు ఖరారు

ఎస్టీ రిజర్వడ్‌ మున్సిపాలిటీలు

అమన్గల్, వర్ధన్నపేట,

దోర్నాల్, మరిపెడ, డోర్నకల్.

Sc : కేతనపల్లి, బెల్లంపల్లి, మధిర, పరకాల, వైరా, నస్కురు, అలంపూర్, తోర్రుర్, నార్సింగి, పెద్ద అంబర్ పేట, ఐజా, పెబ్బేరు, నెరుడుచెర్ల, వడ్డేపల్లి, భూపాలపల్లి, తిరుమలగిరి

Bc : సిరిసిల్ల, నారాయణ పేట, కోరుట్ల, చండూరు, భీంగల్, ఆందోల్, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, నిర్మల్, కిసిగి, రాయికల్, పోచంపల్లి, రమాయపేట, బోధన్, సదాశివ పేట, ఆర్ముర్, మెటపల్లి, గద్వాల్, ఎల్లారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, సుల్తానాబాద్, నర్సంపేట, కిదంగల్, తుఫ్రాన్, ఆలేరు, భువనగిరి.

ఓపెన్ కేటగిరీలో ఎవరైనా పోటీ చేయవచ్చు. ఎస్సి, ఎస్టీ, బిసి, ఓసి లందరూ పోటీ చేయవచ్చు.

13 కార్పొరేషన్ లలో రిజర్వేషన్లు 1 ఏస్టి మీర్ పెట్, ఎస్సి రామగుండం, Bc జవహర్ నగర్, వరంగల్, నిజామాబాద్, బండ్లగూడ.

ఓపెన్బం : డాగ్ పెట్, కరీంనగర్, బొడుప్పల్, పిర్జాదిగూడ. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నిజాంపేట.

Tags

Read MoreRead Less
Next Story