క్రైమ్

మైదుకూరులో రోడ్డు ప్రమాదం.. 12మందికి గాయాలు

మైదుకూరులో రోడ్డు ప్రమాదం.. 12మందికి గాయాలు
X

ccident

కడప జిల్లా మైదుకూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముదిరెడ్డిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు, మినీ వ్యాన్‌ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన 12మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గుజరాత్‌కు చెందిన వీళ్లు.. మినీవ్యాన్‌లో శ్రీశైలం నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. దీంతో క్షతగాత్రులను వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. తీవ్ర గాయాలతో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కొందరికి తలకు గాయాలు అయ్యాయి. మరికొందరికి కాళ్లు విరిగాయి.

Next Story

RELATED STORIES