ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్‌.. మూడురోజుల పాటు కనువిందు

ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్‌.. మూడురోజుల పాటు కనువిందు

flemingo-festiva-

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 3 రోజుల పాటు కనువిందు చేసిన ఫ్లెమింగో ఫెస్టివల్‌ ముగిసింది. పట్టణంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన ముగింపు వేడుకల్లో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌, ఏపీఐఐసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు ఆద్యంతం అందరిని కనువిందు చేశాయి. పడవ పందాలు, కబడ్డీ పోటీలు, సూళ్లూరుపేట, నేలపట్టు, బీములపాళెం, ఆటకానితిప్ప ప్రాంతాల ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఫెస్టివల్‌కి వచ్చే ప్రేక్షకులను ఎలాంటి ప్రయాణ ఇక్కట్లు రాకుండా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పర్యాటకులతో నేలపట్టు సందడిగా మారింది. ఐతే ఏర్పాట్లలో కొన్ని లోటుపాట్లు కూడా కనిపించాయి.

పక్షులను దగ్గరగా చూడడానికి అవసరమైన బయోస్కోపులను సరిపడా ఏర్పాటు చేయలేదు. పులికాట్‌ సరస్సులో ఏర్పాట్లు నామ మాత్రంగానే ఉన్నాయని పర్యటకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఏపీఐఐసీ ఛైర్మన్‌ రోజా..ఆట్టహాసంగా ఈ వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతి పండుగతో పాటు.. ఈ ఫెస్టివల్‌ను నిర్వహించంపై సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఈ వేడులను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు. ఏపీని టూరిజం పరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story