తాజా వార్తలు

ఈ నెల 7న మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్..

ఈ నెల 7న మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్..
X

elections

మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. మొత్తం రిజర్వేషన్ లలో 50 శాతం మించకుండా ఆయా సామాజికవర్గాలకు కేటాయింపులు చేసినట్లు మున్సిపల్ డైరెక్టర్ శ్రీదేవి స్పష్టం చేశారు. 128 మున్సిపాలిటీలు ఉండగా జడ్చర్ల, నకిరేకల్ పాలకవర్గానికి ఇంకా సమయం ఉంది. పాల్వంచ, మందమర్రి, మణుగూరుకు పలు కారణాలతో రిజర్వేషన్ ప్రకటించ లేదు. అలాగే మిగతా వాటికి ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లే తరువాత ఎన్నికల్లో కూడా వర్తిస్తాయని శ్రీదేవి తెలిపారు. అయితే 13 కార్పొరేషన్లలో ఎస్టీ 1, ఎస్సీ 1, బీసీ 4, ఓపెన్ కేటగిరీలో 7 స్థానాలకు రిజర్వేషన్లు కల్పించారు. అదే విధంగా మొత్తం జనాభాలో 1.9 శాతం ఉన్న ఎస్టీ జనాభాకు 3.25 శాతం సీట్లు, 3.6 శాతం ఉన్న ఎస్సి జనాభాకు 14 శాతం సీట్లు, 32.5 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. కాగా ఎస్టీ 4, ఎస్సి 17, బీసీ 40, ఓపెన్ 62 మున్సిపాలిటీలు రిజర్వ్‌డ్ చేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

మున్సిపాలిటీలలో వార్డుల రిజర్వేషన్లకు సంబంధించి ఆయా మున్సిపల్ కమిషనర్ లు రిజర్వేషన్లు ప్రకటించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ లకు రిజర్వేషన్లు మున్సిపల్ అధికారులు విడుదల చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్స్, మేయర్ లలో మహిళా రిజర్వేషన్లను లాటరీ పద్దతి ద్వారా కేటాయించారు. ఈ ప్రక్రియను అన్ని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల నాయకుల సమావేశం నిర్వహించి, వారి సమక్షంలోనే లాటరీలు తీసి రిజర్వేషన్లు చదివి వినిపించారు. కాగా 13 కార్పొరేషన్ లలో మీర్‌పేట్‌ ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సి జనరల్ కు కేటాయించారు. జవహర్ నగర్, వరంగల్, నిజామాబాద్, బండ్లగూడలు వెనుకబడిన వర్గాలకు రిజర్వ్ చేశారు. బడంగ్‌పేట్, కరీంనగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నిజాంపేట కార్పొరేషన్ లు జనరల్ స్థానాలుగా ప్రకటించారు.

మొత్తం మున్సిపాలిటీల్లో నాలుగు ST రిజర్వుడ్ మున్సిపాలిటీలుగా ప్రకటించారు.ఆమన్గల్, వర్ధన్నపేట, దోర్నాల్, మరిపెడ, డోర్నకల్...Sc కేతనపల్లి, బెల్లంపల్లి, మధిర, పరకాల, వైరా, నస్పూరు, అలంపూర్, తోర్రుర్, నార్సింగి, పెద్ద అంబర్ పేట, ఐజా, పెబ్బేరు, నేరేడుచెర్ల, వడ్డేపల్లి, భూపాలపల్లి, తిరుమలగిరి Bc కి.... సిరిసిల్ల, నారాయణ పేట, కోరుట్ల, చండూరు, భీంగల్, ఆందోల్, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, నిర్మల్, కోసిగి, రాయికల్, పోచంపల్లి, రామాయంపేట, బోధన్, సదాశివ పేట, ఆర్మూర్, మెట్‌పల్లి, గద్వాల్, ఎల్లారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, సుల్తానాబాద్, నర్సంపేట, కోడంగల్, తుఫ్రాన్, ఆలేరు, భువనగిరి..... ఓపెన్ కేటగిరీలో ఎస్సి, ఎస్టీ, బిసి, ఓసిలలో ఎవరైనా పోటీ చేయవచ్చని మున్సిపల్ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు.

మున్సిపాలిటీలకు ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల పై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా రిజర్వేషన్ల ప్రక్రియ సాగిందని ఆరోపించారు పార్టీల నేతలు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల సంఘంతో కుమ్మక్కై ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి కుట్ర పన్నుతోందని... టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. అభ్యర్థుల ఎంపికకు సరైన సమయం ఇవ్వకుండా షెడ్యూల్‌ రూపొందించారని.. ఇది కుట్రలో భాగమేనని ఉత్తమ్‌ విమర్శించారు. పురపాలక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 7న నోటిఫికేషన్ వెలువడనుండగా,22న ఎన్నికలు జరగనున్నాయి. 24న ఓట్ల లెక్కింపు,ఫలితాలు వెలువడనున్నాయి.

Next Story

RELATED STORIES