జగన్ సర్కారుకు హిందూ మహాసభ ఛైర్మన్ చక్రపాణి మహరాజ్ హెచ్చరిక

X
TV5 Telugu7 Jan 2020 3:05 PM GMT
ఏపీ రాజధానిని అమరావతి నుంచి మారిస్తే ఊరుకునేది లేదని.. హిందూమహాసభ ఛైర్మన్ చక్రపాణి మహరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ లక్షలాది రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాజధాని కోసం ఇంతలా పోరాడుతున్న వారిని ఆయన అభినందించారు. అలాగే శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హిందూ సంస్కృతికి పట్టుగొమ్మ లాంటి అమరావతినే రాష్ట్ర రాజధానిగా ఉంచాలంటూ ఆయన డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి సర్కారు ప్రజల మనోభావాలకు విలువనిచ్చి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చక్రపాణి మహరాజ్ సూచించారు.
Next Story